సాయి పల్లవి కి క్రేజీ ఛాన్స్?

‘ప్రేమమ్’సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ‘్ఫదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్‌కి గట్టి పోటీగా మారిన ఈ అమ్మడికి ఇప్పుడు అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా క్రేజీ ఆఫర్‌లతో దూసుకుపోతున్న ఈ భామకు మరో అవకాశం తలుపుతట్టింది. అప్పట్లో ధనుష్ హీరోగా నటించిన ‘మారి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ‘మారి-2’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమాను హీరో ధనుష్ సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *