సాయి ధరమ్ సరసన లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి. అదేనండి లావణ్య త్రిపాఠికి ఈమధ్య సరైన సినిమాలు పడడంలేదు. ఈమధ్యే మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి చేసిన ‘మిస్టర్’ భారీ పరాజయం సాధించడంతో పాపం ఈమెకు అవకాశాలు తగ్గాయి. కానీ ఈమె ఫోకస్ మొత్తం మెగా హీరోలపైనే పెట్టుకుంది. అందుకే వేరే సినిమాలలో అవకాశాలు వస్తున్నా కూడా మరో మెగా హీరోతో జోడీ కట్టేందుకు సిద్ధం అయింది. ప్రస్తుతం ‘జవాన్’ సినిమాలో నటిస్తున్న సాయిధరమ్‌తేజ్ నెక్స్ట్ సినిమా వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య అవకాశాన్ని కొట్టేసిందట. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని తెగ ఆశపడుతోంది. దానికితోడు మెగా కాంపౌండ్‌లోని హీరోలతో చేస్తే అటు చరణ్, ఇటు బన్నీలతో అవకాశాలు పట్టేయొచ్చని ఈ అమ్మడి ఫీలింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *