రాజుగారి గది 2 రివ్యూ

‘రాజుగారి గది’సినిమాతో తో భారీ విజయం అందుకున్న ఓంకార్ ఇప్పుడు ‘రాజుగారి గది-2’ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నాగార్జున, సమంత లాంటి స్టార్లు నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూసేద్దాం

కథ:

ప్రాణ స్నేహితులైన అశ్విన్‌(అశ్విన్‌), కిశోర్‌(వెన్నెల కిశోర్‌), ప్రవీణ్‌(ప్రవీణ్‌)  బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతో ఓ రాజుగారి రిసార్ట్‌ను కొనుగోలు చేసి అందులోకి వెళ్ళతారు..ఇక ఆలా వెళ్లిన వారికీ రాత్రి కాగానే అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. ఆ రిసార్ట్‌ లో కొన్ని భయంకర శబ్దాలు వినిపించడం , ఓ నీడ కనిపించడం మొదలు పెడుతుంది..ఏంటి అని ఆరా తీయగా వారికీ అందులో దయ్యం ఉన్న సంగతి వాళ్లకు తెలిసొస్తుంది. దీంతో ఎలాగైనా ఆ దెయ్యాన్ని రిసార్ట్‌ నుండి బయటకు పంపించాలని చర్చి ఫాదర్‌ (నరేశ్‌)ని సంప్రదిస్తారు. ఫాదర్‌ మాత్రం ఇలాంటి వాటికీ రుద్ర (నాగార్జున ) అయితే కరెక్ట్ అని అతడిని పిలిపిస్తాడు. కళ్లలో చూస్తూ మనసులో ఏముందో చెప్పగల సమర్థుడు రుద్ర. పోలీసులు సాల్వ్ చేయ‌లేని కేసుల్లో వారికి స‌హాయ‌ప‌డుతుంటాడు. అతనొచ్చి దయ్యం గుట్టు విప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ ఆ రిసార్ట్ లో నిజంగానే దయ్యం ఉందా.. ఉంటే దాని కథేంటి.. అది అక్కడే ఎందుకు తిరుగుతోంది..  చివరకు ఆమె రిసార్ట్‌ నుండి బయటకు వెళుతుందా.. లేదా..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున మరియు సమంత కీలక పాత్రల్ని చేయడమే సినిమాకి ప్రధాన బలం. మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున నటన, లుక్, యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు . కుటుంబ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా క‌థని మ‌లచ‌డం సినిమాకి మరో ప్ల‌స్స‌యింది. సమంతని బాధపెట్టిన వాళ్ళపై పగ తీర్చుకోవాలనుకునే ఆత్మగా ఆమె నటన అదుర్స్ అనే చెప్పుకోవాలి. ఇక క్లైమాక్స్ సన్నివేశంలో నాగ్, సమంతల నటన ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. అలాగే సినిమాలో వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌, అశ్విన్ స్నేహితుల మ‌ధ్య స‌న్నివేశాలు యువ‌త‌రాన్ని టార్గెట్ చేసి తెర‌కెక్కించిన‌వే .

మైనస్ పాయింట్స్ :

సినిమాలో సరైన కథ, కథనాలు లేకపోవడమే పెద్ద మైనస్, సినిమా రివెంజ్ డ్రామా అని ఆరంభంలోనే తెలిసిపోతుంది కాబట్టి కథని సులభంగానే ఊహించేయవచ్చు. ఫస్టాఫ్ లో రొటీన్ కామెడీని నడిపి టైమ్ పాస్ చేయడంతో బోర్ కొట్టింది.

Moviefox Movie Rating: 3.75

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *