సంక్రాంతికే భాగమతి?

అందాల భామ అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి ఇమేజ్ తెచ్చుకుంది. అరుంధతి సినిమాతో స్టార్ హీరోలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద దుమారం రేపిన అనుష్క.. బాహుబలిలో దేవసేనగా తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటిస్తున్న మరో సినిమా భాగమతి. పిల్లజమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ భారీగా పెరగడంవల్ల షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ నిజానికి సినిమా షూటింగ్ పూర్తయిందని, గ్రాఫిక్స్ కోసం ఆలస్యం అవుతున్నట్టు యూనిట్ తెలిపింది. భారీ బడ్జెట్‌తో యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భాగమతి అనగానే హైదరాబాద్‌లో అప్పటి భాగమతి కథ కాదని దర్శకుడు చెబుతున్నాడు. బాహుబలి తరువాత అనుష్క మరే సినిమా చేయడంలేదు, ఈ ఒక్క సినిమా తప్ప. సింగం 3, ఓం నమో వెంకటేశాయ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో భాగమతిపై భారీ ఆశలు పెట్టుకుంది అనుష్క. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *